శ్రీ
దత్తాత్రేయ స్వామి చరిత్ర పుస్తకము కావలసిన వారు మీ చిరునామా ఫోన్ నెంబర్ మెసేజ్ పంప
ప్రార్ధన.
నా
whatsapp :: please don’t call :message only :: 81
21 22 57 19 --- దయచేసి పేజి క్రింద coments లో మీ చిరునామా పెట్టకండి. మేము చూడకుండా ఉండే అవకాశము ఉన్నది.
e-mail: gmsgodman@gmail.com
From:
mannava satyam
“శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్ర” అంటే పురాణాలలో వివరించబడిన
మహా మహిమాన్వితమైన దివ్యచరిత్ర. శ్రీగురు చరిత్ర మాత్రమే కాదు...దత్త భక్తుల వద్ద తప్పక
ఉండవలసిన పుస్తకము...దత్త భక్తులు ఆదరించండి...ఈ క్రింది వాక్యాలు ఓపికతో చదవమని ప్రార్ధన.....
ఓం సాయి మాస్టర్
మిత్రులారా! దత్త
బంధువులారా! ప్రేమపూర్వక నమస్కారములు. ఒక
ముఖ్యమైన విషయము మీ దృష్టికి తేవాలని ఇలా మీకు వ్రాస్తున్నాను. ఆది గురువు యోగనాధుడు స్మృతిమాత్ర ప్రసన్నుడు అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి
సర్వ జీవులను పరిపూర్ణముగా ఉద్ధరించడానికి అవతరించి మనమీద కరుణతో మానవాళికి తనకు తాను
దత్తుడై, జన్మించిన ప్రతి జీవి పరిపూర్ణముగా ఉద్దరింపబడే దాకా
తాను వివిధ రూపాలలో అవతారిస్తూ మన మధ్యనే ఉంటూ మనను అనుగ్రహిస్తు ఉంటారని, దత్తవతారము నకు అవతార సమాప్తి లేదని మహనీయులందరూ చెప్పారు.శ్రీ దత్త ప్రభువు అవతరించి కలియుగములో మొదటి దత్తవతారముగా శ్రీ శ్రీపాద శ్రీవల్లభ
స్వామిగాను, రెండవ సారి శ్రీ గాణుగాపుర శ్రీగురు శ్రీ నృసింహ
సరస్వతి స్వామి వారు గానూ, మూడవ అవతారముగా శ్రీ మాణిక్య ప్రభు
మహారాజ్ గానూ, నాలుగవ అవతారముగా స్వామి సమర్ధ అక్కలకోట స్వామి
గానూ, ఐదవ అవతరముగా శిరిడీ సాయి బాబా వారి గానూ అవతరించారని మహాత్ములు
చెప్పారు. వీరే గాక అనేకానేక మహనీయులుగా దత్తాంశ తో జన్మించిన
మహనీయులు శ్రీ వాసుదేవనంద స్వరస్వతి స్వామి శ్రీ గుళవని మహారాజ్, శ్రీ నిసర్గ దత్త మహారాజ్, శ్రీ ఖేడ్గం నారాయణ్ మహారాజ్,
ధునివాలా దాదా వారు, శ్రీ గజానన మహారాజ్ వారు,
శ్రీధర స్వామి మొదలైన అనేకానేక దత్తాంశ తో అవతరించిన మహనీయులు ఉన్నారు.
వీరి అందరికీ వారి వారి మూల క్షేత్రములేగాక భక్తులు నిర్మించుకున్న మఠాలు
ఆశ్రమాలు దేవాలయాలు లెక్కకు మించి ఉన్నాయి. తెలుగు వారి ప్రాంతాలలో
కూడా ఎన్నో ఎన్నెనో వీరికి సంబంధించిన ప్రదేశాలు
ఉన్నాయి. ఆ ప్రదేశాలకు వెళ్ళి భక్తులు వారిని సేవించుకుంటూ ఫలితాలు
పొందుతూ ఉన్నారు.
మిత్రులారా! ముఖ్యముగా
చెప్పుతున్నది ఏమిటి అంటే.. ఈ క్షేత్రాలు అన్నిటిలోనూ ఆ ఆ ప్రాంగణములలో
శ్రీ దత్త ప్రభువు కొలువై ఉంటారు. ఒక చిన్న దత్తమందిరము ఉండనే
ఉంటుంది. శ్రీ శిరిడీ
సాయి మందిరాలలో కూడా తప్పనిసరిగా శ్రీ దత్త మందిరము కూడా ఉంటుంది.
ఇలా ప్రతి చోట
శ్రీ దత్త ప్రభువు కొలువై ఉన్నప్పటికి దత్త జయంతి, గురు పూర్ణిమ ముఖ్యమైన
దత్త స్వామి పండుగలలో “శ్రీ గురు చరిత్ర” విశేషముగా పారాయణ చేస్తూ ఉంటారు.
అంతే కాదు దత్త స్వామిని అందరూ
ఆరాధిస్తారు. పూజిస్తారు. ఉపాసిస్తారు.
మిత్రులారా! శ్రీగురు చరిత్ర మాత్రమే కాకుండా,
శ్రీ దత్తాత్రేయ స్వామి వారి కి చాలా చాలా మహిమాన్వితమైన చరిత్ర ఉంది.
పురాణాలలో అక్కడక్కడ నిక్షిప్తమై ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్రను
తెలుగు ప్రజలకు అందించాలని మహనీయులు ఎందరో విశేషముగా కృషి చేశారు.
మిత్రులారా! సాయి
మాస్టర్ భక్తుడ నైన నేను శ్రీగురు చరిత్ర శ్రీ సాయి చరిత్ర ఎన్నో దశాబ్దాలుగా పారాయణ
చేస్తూ ఉన్నప్పుడూ, శ్రీ సాయి పరిపూర్ణ దత్తవతారము అని పూజ్య
మాస్టర్ గారు అనేక పర్యాయాలు ప్రకటించినందువల్ల, సాయి చరిత్ర,
శ్రీగురు చరిత్ర చదివిన ప్రతి సారి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర
కూడా అందరమూ పారాయణ చేసుకుంటే ఇంకా ఎంతో దత్తానుగ్రహము కలుగుతుంది అని, ఎలాగైనా శ్రీ దత్త స్వామి వారి చరిత్రను అందరికీ అందించాలని అందుకు అనుగ్రహించమని
సంకల్పము చేసుకుంటూ ఉండేవాడిని. ఇప్పటికీ శ్రీ దత్త స్వామి అనుగ్రహ ఆశీస్సుల వల్ల శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్ర
పుస్తకాన్ని రచించి ప్రచురించ గలిగాను. శ్రీ దత్త భక్తులు అందరూ
ఈ పుస్తకమును ఆదరించి శ్రీ గురు చరిత్ర తో పాటుగా ఈ శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దివ్య
చరిత్ర కూడా పారాయణలు చేసుకుని దత్తానుగ్రహము మరింతగా పొందాలని ఉద్దేశ్యముతో మీకు ఇదంతా
విన్నవించుకుంటున్నాను. ముఖ్యముగా తెలుగు వారు ఉన్న ప్రాంతాలలో, దత్త మూర్తి ఉన్న ప్రతి దేవాలయ ప్రాంగణములోను,
దత్త స్వామి చిత్రపటము ఉన్న ప్రతి గృహములోను ఈ పుస్తకము పారాయణ జరగాలని ప్రార్ధిస్తూ ఉన్నాను . మీ
సహకారము కోరుతున్నాను. నేను ప్రచురించిన ఈ శ్రీ దత్త త్రేయ స్వామి వారి చరిత్రను ఆదరించండి. దత్త
స్వరూపులైన మీరు నన్ను అనుగ్రహించి ఆశీర్వదించండి. అని ప్రార్ధిస్తూ
ఉన్నాను.
నా whatsapp for
message only please don’t call :
81 21 22 57 19 e-mail:
gmsgodman@gmail.com
సాయి మాస్టర్
దివ్యస్మరణలో ...
మన్నవ సత్యం