om sai master :: 12/08/2022...sravana purnima ..పూజ్య శ్రీ సద్గురు భరద్వాజ మాస్టర్ గారు తమ జీవిత కాలములో ... విధి విధాన పూర్వకముగా ఉపనయనము చేసి పవిత్రమైన గాయత్రి మంత్రము చెవిలో ఉపదేశించింది నాకు ఒక్కడికే ... ఆ ఉపదేశ క్షణాలు స్మరించుకుంటూ.....మన్నవ సత్యం
సద్గురు భరద్వాజ మాస్టర్ గారు ... శ్రీ సాయి సంప్రదాయము ప్రకారముగా చెవిలో మంత్రోపదేశము ఎవరికి చేయలేదు. మంత్రోపదేశము అడిగిన వారికి ఏదో ఒక నామము వ్రాసి ఇచ్చి స్మరణ చేసుకోమని చెప్పేవారు...ఐతే వారు తమ జీవిత కాలముతో నాకు ఒక్కడికి మాత్రమే విధి పూర్వకముగా ఉపనయనము చేయించి తానే స్వయముగా నా చెవిలో గాయత్రి మంత్రము ఉపదేశించారు.. అది మాతల్లి తండ్రులు నేను కోటి జన్మలు చేసుకున్నా పుణ్య ఫలము. పూజ్య మాస్టర్ గారికి నా పై గల పరిపూర్ణ ప్రేమ అనుగ్రహము వల్ల నేను వారి చే గాయత్రి మంత్రోపదేశము నాకు లభించింది.. అందువల్ల నేను అప్పటినుండి గాయత్రి మంత్రానుష్టానము శ్రద్ధగా చేసుకుంటున్నాను...ఆ తర్వాతే సాయి నాధ దత్తపాదుకా నామము లు స్మరిస్తాను....మాస్టర్ గారు చేసిన మంత్రోపదేశ క్షణాలు ప్రతిరోజూ గుర్తుచేసుకుంటూ నమస్కరించుకుంటూ ఉంటాను...